తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంత్రి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం' - నిర్మల్​ పట్టణంలోని అభివృద్ధి పనులు తాజా వార్త

నిర్మల్​ పట్టణాన్ని అభివృద్ధికి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మున్సిపల్​ ఛైర్మన్​ ఈశ్వర్​ తెలిపారు. నగరంలో చేపట్టిన రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించారు.

Municipal Chairman Ishwar inspected development works in Nirmal town
'మంత్రి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం'

By

Published : Nov 5, 2020, 1:01 PM IST

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సాయంతో నిర్మల్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ మినీట్యాంక్ బండ్​పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు ఉన్న రోడ్డును మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

స్థానిక ఈదిగాం చౌరస్తా నుంచి శివాజీచౌక్ వరకు రూ. 3 కోట్లతో రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నిర్మల్ పట్టణాభివృద్ధికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గండ్రత్ రమణ, జహీర్, మున్సిపల్ ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సురక్షితంగా రోడ్డు దాటేలా ఆకాశ మార్గాలు..

ABOUT THE AUTHOR

...view details