తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి' - muncipal election bjp meeting

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో భాజపా విజయానికి కృషి చేయాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. భైంసాలో మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'
'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'

By

Published : Jan 7, 2020, 6:37 PM IST

నిర్మల్ జిల్లా భైంసాలో భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై... మున్సిపల్​ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసారు. పట్టణంలోని 26 వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు.

కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా పని చేసి మున్సిపలిటీలో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను పట్టికోవడం లేదని... జిల్లా అధ్యక్షురాలు, ముథోల్​ ఇన్​ఛార్జి రమాదేవిపై కొంతమంది ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

'ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి'

ఇవీచూడండి:కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details