నిర్మల్ జిల్లాలోని ముజ్గి మల్లన్న ఆలయంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. శుక్రవారం స్వామివారి కల్యాణం, శనివారం సల్లకుండలు, ఆదివారం రథయాత్ర, సోమవారం నాగవేల్లి, మంగళవారం అన్నదానం చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
నేటి నుంచి ముజ్గి మల్లన్న జాతర
భక్తుల కొంగుబంగారం ముజ్గి మల్లన్న జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాలయానికి ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
నేటి నుంచి ముజ్గి మల్లన్న జాతర
ఈ ఆలయంలోని స్వామివారు యాదవులచే పూజలందుకుంటారు. యాదవ కుటుంబానికి చెందిన వ్యక్తులు వంతుల వారీగా పూజాధికాలు చేస్తుంటారు. యాదవ కుటుంబంలో పుట్టిపెరిగిన మల్లన్నస్వామి శివుని అంశ అని, ఈ కారణంగానే ఆయనను తమవాళ్లు పూజిస్తుంటారని వారు చెబుతున్నారు. మల్లన్న జాతరకు నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.