నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గురువారం రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి హాజరయ్యారు. రక్తదానం మహాదానం లాంటిదని, ఆపద సమయంలో రక్తం అవసరమైతే రక్తదానం చేయాలని పిలుపు నిచ్చారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందన్నారు. సవిత మెమోరియల్ ట్రస్ట్ ఎంతో మంది విద్యార్థులకు చేయూతనిస్తుందన్నారు.
వైద్యురాలి జ్ఞాపకార్థం.. కుటుంబ సభ్యుల రక్తదానం - నిర్మల్ జిల్లా
సవిత అనే వైద్యురాలు రెండు సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గురువారం రక్తదాన కార్యక్రమం నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రంలో నిర్వహించారు.
వైద్యురాలి జ్ఞాపకార్థం.. కుటుంబ సభ్యుల రక్తదానం