నిర్మల్ జిల్లా భైంసాలో ఘర్షణలు చెలరేగడం దురదృష్టకరమని ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. చిన్న చిన్న తగాదాలు... పెద్ద గొడవలుగా మారి పట్టణమంతా వ్యాప్తి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముధోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భైంసా ఘటనలపై ఆయన స్పందించారు.
భైంసా ఘటనలు దురదృష్టకరం: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
భైంసా ఘటనలపై ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని కోరారు. పట్టణంలో రెండో రోజు సెక్షన్ 144 అమలులో ఉంది.

భైంసా ఘటనలు దురదృష్టకరం: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
పుకార్లను నమ్మవద్దని... శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని కోరారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఘర్షణలు జరిగిన రెండోరోజు 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రధాన వీధుల్లో పోలీసులు భారీగా మోహరించి బంద్‌ను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు.