రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సారంగాపూర్ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని... కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాలని సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
'ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి' - తెలంగాణ వార్తలు
రైతులు దళారులను నమ్మకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో కొంటోందని తెలిపారు. నిర్మల్ జిల్లా ఆలూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1,888, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1,868 మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ మాణిక్ రెడ్డి, అడెల్లి ఆలయ ఛైర్మన్ అయిటి చందు, సర్పంచ్ దండు రాధ సాయికృష్ణ, వైస్ ఎంపీపీ పతాని రాధ భూమేష్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, చందుల సాయినాథ్, మాజీ సర్పంచ్ జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్ కోతలు