తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు భద్రతపై అందరికీ అవగాహన ఉండాలి: ఎస్పీ శశిధర్ - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

వాహనాలు నడిపేటప్పుడు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ శశిధర్​ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్ బీడ్ గ్రామంలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Motorists awareness programs on road safety rules
రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాలు

By

Published : Mar 16, 2020, 5:46 PM IST

గ్రామ గ్రామాన రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్​ రాజు అన్నారు. ముధోల్​ మండలం ఎడ్​ బీడ్​ గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు ఎలా జరుగుతాయి?.. డ్రైవింగ్​ లైసెన్సు పొందడం ఎలా?.. తదితర అంశాలపై పోలీసు కళాజాత బృందంతో అవగాహన కల్పించారు.

గతేడాది జిల్లా వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయారని... వారిలో 80% మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారు ఉన్నారని తెలిపారు. వాహనదారులకు భద్రతా నియమాల పట్ల అవగాహన లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమనికి ఏడీపీ శ్రీనివాస్, డీఎస్పీ నర్సింగ్ రావు ఇతర అధికారులు హాజరయ్యారు.

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాలు

ఇదీ చూడండి:సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details