నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టులు, పల్లె ప్రకృతి వనాలను శనివారం డీఆర్డీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. గ్రామాల్లో వానరాల బెడదను తప్పించేందుకే ప్రభుత్వం ఈ మంకీ ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. కోతులు ఇష్టంగా తినే పండ్లచెట్లను వాటిలో పెంచనున్నట్టు తెలిపారు.
'కోతుల బెడదను అరికట్టేందుకే మంకీ ఫుడ్ కోర్టులు' - కోతుల ఆహారం తాజా వార్త
కోతుల బెడదను నివారించేందుకు ప్రభుత్వం మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తుందని నిర్మల్ జిల్లా మామడ మండలం డీఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు.
Breaking News
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చదనంతో నిండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాపురెడ్డి, ఎంపీడీఓ రమేష్, ఏపీఓ శివాజీ, కార్యదర్శి సురేష్, టీఏ కరీం, అశోక్ పాల్గొన్నారు.