'నిర్మల్లో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు' - ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు..
నిర్మల్ జిల్లాలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా చేపట్టారు. స్థానిక భాజపా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోదీ కృషితోనే దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని పేర్కొన్నారు.
భాజపా ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ
ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు నిర్మల్ జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని దేశం అన్ని రంగాల్లో ముందుందని నిర్మల్ భాజపా శ్రేణులు కీర్తించాయి. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు మోదీ ఎంతో కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.