నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు నిరాడంబరంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.
నిర్మల్లో నిరాడంబరంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఈసారి కళ తప్పాయి. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరై.. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
![నిర్మల్లో నిరాడంబరంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు Modest Ganesh Immersion Celebrations in Nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8613985-879-8613985-1598775464577.jpg)
నిర్మల్లో నిరాడంబరంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులు గణనాథుడిని పల్లకిపై నెలకొల్పి.. పాదయాత్రగా తీసుకెళ్లారు. బొజ్జ గణపయ్యను జనం ఆసక్తిగా తిలకించారు.
ఇదీచూడండి.. మలిసంధ్యలో అమ్మానాన్నకు ఆదరణ కరవు...