నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మొక్కలు నాటారు. మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో హరితహారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
హరితహారంతో వాతావరణ సమతుల్యత: ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి - MLA Vital reddy
వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వెల్లడించారు.
వాతావరణ సమతుల్యత కోసమే హరితహారం
ప్రకృతి సమస్యలకు పరిష్కారం సాధించాలంటే.. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని కాపాడుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు.