అన్నదాతల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు వేదికలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు ప్రతి సంఘానికి భవనాలు ఉండేవని పేర్కొన్నారు.
తెరాస అధికారంలోకొచ్చాక రైతుల కోసం ఆలోచించి అన్నదాతలు ఒకేచోట కూర్చొని వారి సమస్యలు చర్చించుకోవడానికే వేదికలు నిర్మించామన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తారోడాలో రైతు వేదికను ప్రారంభించారు.