నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మలేగమ్ గ్రామంలోని రైతువేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. తిరిగి నిగ్వలోని మరో వేదిక ప్రారంభోత్సవనికి వెళ్తుండగా ఎమ్మెల్యేని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల మహిళలు అడ్డుకున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి నాలుగేళ్లుగా ఇంకా పూర్తి చేయలేదన్నారు. 30 మంది.. ఒక్కొక్కరి నుంచి లక్ష 20 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మొదటి విడతలో 60వేలు ఇచ్చామని.. ఇంకా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు.