BHAGEERATHA PIPE LEAK:కేవలం 24 గంటల వ్యవధిలోనే రెండు కిలోమీటర్ల పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్ రెండు చోట్ల లీకైంది. మంచినీరు రోడ్డుపై వృథాగా పారింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్ వద్ద నిన్న సాయంత్రం.. భగీరథ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్ లీకైంది. ఫౌంటెన్‌ను తలపించేలా పైకి ఎగజిమ్మింది.
BHAGEERATHA PIPE LEAK: మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్.. భారీగా నీటి వృథా - sirgapur
BHAGEERATHA PIPE LEAK: మిషన్ భగీరథ పైప్ లైన్ ఒక్కరోజు వ్యవధిలోనే రెండు చోట్ల లీకైంది. దీంతో రోడ్డుపై భారీ ఎత్తున విరజిమ్మింది. మంచి నీరు వృథాగా పారింది. నిర్మల్ జిల్లాలోని రెండు వేర్వేరు గ్రామాల్లో లీకైన పైపులకు వెంటనే నీటి సరఫరా నిలిపేసిన అధికారులు మరమ్మతులు చేపట్టారు.
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్
కాసేపటికే లోలం గ్రామ సమీపంలో మరోచోట పైప్‌లైన్ లీకై మంచి నీరు నేలపాలైంది. సమాచారం అందుకున్న మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. నీటి వృథాను అరికట్టేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: