తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్​కు యువకుడి ట్వీట్.. స్పందించిన మంత్రి​ - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

లక్షల రూపాయలతో నిర్మించిన మిషన్​ భగీరథ పథకం సరిగ్గా అమలు కావట్లేదని మంత్రి కేటీఆర్​కు ఓ యువకుడు ట్వీట్​ చేశాడు. స్పందించిన మంత్రి వెంటనే అధికారులను ఆదేశించారు. అధికారులు ఆ గ్రామానికి వెళ్లి చర్యలు కూడా చేపట్టారు. ఈ సంఘటన నిర్మల్​ జిల్లాలో జరిగింది.

కేటీఆర్​కు యువకుడి ట్వీట్.. స్పందించిన మంత్రి​
కేటీఆర్​కు యువకుడి ట్వీట్.. స్పందించిన మంత్రి​

By

Published : May 23, 2020, 3:17 PM IST

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్.. ట్వీటర్​లో స్పందిస్తున్నారని విషయం తెలుసుకున్న ఓ యువకుడు తమ గ్రామంలో మిషన్​ భగీరథ పథకం సమస్యపై ట్వీట్​ చేశాడు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికి చుక్క నీరైన అందించలేదని పేర్కొన్నాడు.

అయితే వెంటనే స్పందించిన మంత్రి.. జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఆ గ్రామానికి చేరుకుని సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఆ దిశగా అధికారులు పనులు కూడా ప్రారంభించారు. రెండు రోజుల్లో నీరు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా తానుర్ మండలం కోలూర్​లో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన హరీశ్​ అనే యువకుడు ఆ ట్వీట్ చేశాడు.

కేటీఆర్​కు యువకుడి ట్వీట్.. స్పందించిన మంత్రి​

"మా ఇంటి దగ్గర మూడేళ్ల క్రితం మిషన్​ భగీరథకు సంబంధించిన నల్లాలు బిగించారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే నల్లాల నుంచి నీరు రాకపోవడమే కాకుండా.. ఎక్కడివి అక్కడే పడిపోయాయి. అయితే కేటీఆర్​కు ట్వీట్​ చేసిన 4 గంటల్లోనే అధికారుల స్పందించారు. రెండు రోజుల్లో నీరు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు."

-హరీశ్​, ట్వీట్​ చేసిన యువకుడు

ఆ యువకుడి వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. హరీశ్​ను అభినందించారు. అలాగే వెంటనే స్పందించిన కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్​ సలాం!

ABOUT THE AUTHOR

...view details