పేద ఆడపడుచులు సైతం బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు.
'రాష్ట్ర ఆడపడుచులందరికీ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలు' - bathukamma sarees distribution
నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం 287 కు పైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు. మహిళలందరికీ పెద్దన్నగా మారి సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరలను ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఏఎంసీ ఛైర్మన్ నర్మద, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.