తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమజ్జనంలో చిందేసిన మంత్రి ఇంద్రకరణ్

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చిందేశారు. వర్షంలోనూ నూతనోత్సాహంతో ఆడారు. నిర్మల్​లోని గణేశ్ ఉత్సవాల్లో మంత్రి ఆహ్లాదంగా గడిపారు.

By

Published : Sep 12, 2019, 5:22 PM IST

నిమజ్జన ఉత్సవాల్లో చిందేసిన మంత్రి ఇంద్రకరణ్

నిమజ్జన ఉత్సవాల్లో చిందేసిన మంత్రి ఇంద్రకరణ్

నిర్మల్లో భారీవర్షంలోనూ సైతం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ప్రతిఒక్కరూ శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను జరుపుకోవాలని సూచించారు. అందరూ పోలీసుల సూచనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్​పై అవగాహన ఫ్లెక్సీని ఆయన ప్రారంభించారు. అనంతరం గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, నిర్వాహకులతో కలిసి మంత్రి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details