రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ... దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని సీఎం కేసీఆర్‌ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. రూ.25 వేల లోపు పంట రుణాలమాఫీ, రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకుగానూ నిర్మల్‌లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
'రైతు సంక్షేమంలో రాష్ట్రానిదే అగ్రస్థానం'
నిర్మల్‌లోని దివ్యాగార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి పాలాభిషేకం నిర్వహించారు. రైతుబంధు, రుణమాఫీ నిధులు మంజూరు చేసినందుకు గానూ... సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
'రైతు సంక్షేమంలో రాష్ట్రానిదే ఆగ్రస్థానం'
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో నిధులు విడుదల చేశారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. రైతులందరి తరఫున సీఎం కేసీఆర్‌కు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!
TAGGED:
loan wavier funds released