తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2020, 5:41 PM IST

ETV Bharat / state

ధరణి పోర్టల్ చరిత్రలో నిలిచిపోతుంది : ఇంద్రకరణ్​ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సేవలను నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోనే తొలి రిజిస్ట్రేషన్​ పత్రాలను లబ్ధిదారులకు ఆయన అందించారు. రెవెన్యూ సంస్కరణల్లో ధరణి చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి వ్యాఖ్యానించారు.

Minister Indrakaranreddy inaugaauration Dharani portal in nirmal dist
ధరణి పోర్టల్ చరిత్రలో నిలిచిపోతుంది : ఇంద్రకరణ్​ రెడ్డి

ధరణి పోర్టల్ సేవలు చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్​ సేవలను మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గంలోనే తొలి రిజిస్ట్రేషన్​ పత్రాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.

రెవెన్యూ సంస్కరణల్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. ధరణి పోర్టల్​లో స్మార్ట్​ ఫోన్​ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా క్రయ, విక్రయదారులకు సులభంగా అరగంటలో రిజిస్ట్రేషన్​ పూర్తవుతుందని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి:ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఇంద్రకరణ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details