తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయ ఆవరణలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ధన్‌రాజ్ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బతుకమ్మ పాట వీడియో చిత్రీకరణను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ ప్రత్యేకమైందని మంత్రి తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ:ఇంద్రకరణ్‌రెడ్డి - bathukamma songs
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట ఆలయంలో బతుకమ్మ పాట వీడియో చిత్రీకరణను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని మంత్రి తెలిపారు.
![తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ:ఇంద్రకరణ్‌రెడ్డి minister indrakaran spoke about bathukamma festival in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9099267-230-9099267-1602156389897.jpg)
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ:ఇంద్రకరణ్‌రెడ్డి
అంతకు ముందు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ ఛైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, కౌన్సిలర్ సముందర్‌పల్లి రాజు, ఆలయాల డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్, ఆలయ ఈవో భూమన్న, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: యాదాద్రి ఆలయ రక్షణ గోడలపై ఏనుగు ప్రతిమలు