నిర్మల్ జిల్లా కేంద్రంలోని నందికొండ దుర్గామాత ఆలయ వార్షికోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ఉదయం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వసంత పంచమిని పురస్కరించుకొని ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వసంత పంచమిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు
నిర్మల్లోని నందికొండ దుర్గామాత అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం చిన్నారుల అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు.
వసంతపంచమి రోజున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి సందర్భంగాా ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:ఆ నిచ్చెన ఎందుకు నడిచింది? ఆ ఫొటోలో ఉన్నవి దెయ్యాలా?