తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి'

అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్​ జిల్లాలో పర్యటిస్తూ... రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

minister indrakaran reddy visiting at Nirmal district
'అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి'

By

Published : Dec 3, 2020, 7:33 PM IST

పట్టణ సుందరీకరణకై అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాం చౌరస్తా నుంచి చేపల మార్కెట్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి.. పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వ్యాపారులతో ముచ్చటించి... వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.

రోడ్డు విస్తరణ నిర్మాణాల గురించి తెలుసుకుంటూ..

ఇదీ చూడండి:'నట్టల వ్యాధి నివారణకు కృషి చేసి జీవాలను రక్షించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details