తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి అక్షరభ్యాసం - దేవాలయాన్ని అద్భుతంగా మారుస్తా

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని  మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తున్న మంత్రి

By

Published : Feb 28, 2019, 11:44 AM IST

Updated : Feb 28, 2019, 12:15 PM IST

రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్​ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతోమంత్రి స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు.
దేవాలయాన్ని అద్భుతంగా మారుస్తా
అమ్మవారి కృపతో మళ్ళీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ. 50 కోట్లతో రెండేళ్లలోపు పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామన్నారు. ఆలయ పరిసరాలను పచ్చదనంతో సుదరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

Last Updated : Feb 28, 2019, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details