నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. వ్యాపారులు, ప్రజలు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, నిబంధలను పాటించని వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
భౌతికదూరం పాటించండి... కరోనాను తరిమికొట్టండి..
కరోనా మహమ్మారి నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజలందరూ భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. నిర్మల్లో ఆకస్మికంగా పర్యటించిన మంత్రి.. కాసేపు బస్సులో ప్రయాణించారు.
భౌతికదూరం పాటించండి... కరోనాను తరిమికొట్టండి
లాక్డౌన్ను ప్రభుత్వం నిర్దేశించిన మే 31 వరకు వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా నిబంధనలను పాటించి... కరోనామహమ్మారిని నిర్మూలించేందుకు దోహదపడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి బస్టాండ్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు బస్సులో ప్రయాణించి... ప్రయాణికులతో ముచ్చటించారు. మంత్రి వెంట నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.