నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రూ. కోటి 20 లక్షలతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు.
'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం' - నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపర్యటన
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దిలావర్‌పూర్ మండలంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
!['రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం' minister indrakaran reddy tour in nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5201287-thumbnail-3x2-indra-rk.jpg)
'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతులకు సలహాలు సూచనలు అందిస్తామన్నారు.
'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'