రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కొండాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఇంద్రకరణ్ రెడ్డి - నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వ కళాశాలల్లో వైద్య సీట్లు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణాలను పూర్తి చేసామని తెలిపారు. హరితహారంలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ పథకాలతో బడుగు వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలో రూ.50 లక్షలతో నూతన చేపల మార్కెట్ భవన నిర్మాణ పనులకు ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.