నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ రైతులపట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో హర్షణీయమైనవని పేర్కొన్నారు. వ్యవసాయంపై రైతులకు భరోసా కలిపించేందుకు పంట కొన్న వారం రోజుల్లోనే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
'రైతే రాజు... లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది' - MINISTER INDRAKARAN REDDY STARTED MARK FED IN NIRMAL DISTRICT
దేశంలో రైతను రాజును చేయటమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'రైతే రాజు... లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోంది'
మార్క్ఫెడ్ ద్వారా రైతులు పండించిన కందులకు 5800 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,553 ఎకరాల్లో కందులు సాగుచేసినట్లు అధికారులు గుర్తించారన్నారు. జిల్లా వ్యాప్తంగా 17,700 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేయనున్నట్టు ప్రభుత్వం అంచనా వేసిందని వెల్లడించారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..