నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పలు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
బాసర ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన - basara news
నిర్మల్ జిల్లాలోని బాసరలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బడ్జెట్లో బాసరకు రూ. 50 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.
మొదటగా శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించకున్న మంత్రి... అనంతరం రూ. 5 కోట్ల 48 లక్షల 85 వేలతో చేపట్టనున్న వీఐపీ అతిథి గృహం ఆధునీకరణ, టీటీడీ పక్కా భవనం నుంచి వ్యాస మహర్షి గృహం వరకు షెడ్ నిర్మాణం, ఆలయ ప్రహారీ గోడ నిర్మాణం, గోదావరి నది ఒడ్డున సూర్వేశ్వర ఆలయం వద్ద షెడ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు. బడ్జెట్లో బాసరకు రూ. 50 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు.