నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్(covid vaccine centre)ను శుక్రవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(minister indrakaran reddy) సందర్శించారు. వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి ప్రజలకు సూచించారు.
నిర్మల్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. శివాజీ చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు ఫుట్‌పాత్ రోలింగ్, సుందరీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు ఆయనకు వివరించారు.