తెలంగాణ

telangana

ETV Bharat / state

indrakaran reddy: 'ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యం' - 57 రకాల పరీక్షలు

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో 3 కోట్ల రూపాయల వ్య‌యంతో ఏర్పాటు చేసిన‌ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని(diagnostic centre) ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 57 రకాల పరీక్షల చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

indrakaran reddy at nirmal
indrakaran reddy: 'ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిచడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యం'

By

Published : Jun 9, 2021, 4:26 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే… ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాల‌లో రూ.3 కోట్ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన‌ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని(diagnostic centre) మంత్రి ప్రారంభించారు.

ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అంందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్(CM KCR) డయాగ్నస్టిక్ హబ్​ కేంద్రాల(diagnostic centre) ఏర్పాటుకు శ్రీకారం చుట్టార‌ని మంత్రి అన్నారు. బ‌డ్జెట్ కేటాయింపులకు అద‌నంగా రూ.10 వేల కోట్ల‌ను వైద్య సేవ‌ల‌ కోసం సీఎం కేటాయించార‌ని వెల్ల‌డించారు.

ఇప్పటి వ‌ర‌కు కార్పొరేట్ హ‌స్పిట‌ల్స్​కే పరిమితమైన వ్యాధి నిర్ధరణ పరీక్షలు.. ఇప్పుడు సామాన్యుల చెంతకు చేరనున్నాయని తెలిపారు. ఈ కేంద్రాల్లో కరోనా పరీక్షలతో పాటుగా రక్త, మూత్ర పరీక్షలు సహా… బీపీ, షుగ‌ర్ త‌దిత‌ర‌ 57 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. సాధారణ పరీక్షలే కాకుండా, ఖ‌ర్చుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తార‌న్నారు.

వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగ నిర్ధరణ పరీక్షల శాంపిల్​ను సేక‌రించి… జిల్లా కేంద్రంలో ఉన్న‌ డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపి… సాయంత్రానిక‌ల్లా టెస్ట్ రిజ‌ల్ట్ నేరుగా మొబైల్ ఫోన్​కు పంపుతార‌ని వివ‌రించారు. భ‌విష్య‌త్తులో నిర్మ‌ల్ జిల్లాలో మ‌రిన్ని వైద్య సేవ‌ల‌ు, సౌక‌ర్యాల క‌ల్పన‌కు కృషి చేస్తాన‌ని మంత్రి అన్నారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, సూపరింటెండెంట్​ దేవేంద‌ర్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ ధ‌న‌రాజ్, జిల్లా ప‌రిష‌త్ ఛైర్ ప‌ర్స‌న్ కొరిప‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, మున్సిప‌ల్ ఛైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పేద ప్రజలకు కార్పొరేట్​స్థాయి వైద్యం: సబితా ఇంద్రారెడ్డి

ABOUT THE AUTHOR

...view details