తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: ఇంద్రకరణ్​ రెడ్డి - తెలంగాణ వార్తలు

డబుల్​ బెడ్​ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి ఆదేశించారు. నిర్మల్​ జిల్లా కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: ఇంద్రకరణ్​ రెడ్డి
డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి: ఇంద్రకరణ్​ రెడ్డి

By

Published : Jun 12, 2021, 10:33 PM IST

నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోళ్లు గడువులోగా పూర్తి చేసిన అధికారులను అభినందించారు. జిల్లాలో కరోనా నియంత్రణకై పటిష్ఠమైన చర్యలు చేపట్టి విజయం సాధించామని తెలిపారు.

పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. బ్లాక్ ఫంగస్ కేసులు జిల్లాలో మొత్తం 14 నమోదు కాగా అందులో నలుగురు చనిపోయారని, పది మంది కోలుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన డిజిటల్ భూసర్వేలో భాగంగా జిల్లాకు సంబంధించి సోన్ మండలం పాక్​పట్ల గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇన్​ఛార్జ్​ ఎస్పీ ప్రవీణ్ కుమార్, జడ్పీ ఛైర్మన్ విజయ లక్ష్మి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ponnam prabhakar: 'ఆ 12 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి'

ABOUT THE AUTHOR

...view details