శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సందర్శించారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు రావటం వల్ల 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గోదారమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి... హారతిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్ట్‌లో జలకళ సంతరించుకుంటోందని తెలిపారు.
గోదారమ్మకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ఎస్సారెస్పీ వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు రావటం వల్ల 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గోదావరి పరివాహక గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
minister indrakaran reddy released srsp water
ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో... గోదావరి పరివాహక గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీటీసీ సభ్యులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం...!'
TAGGED:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు