పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యా గార్డెన్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు రూ.2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు.. గ్రామస్థులను సభ్యులుగా చేర్చేలా చూడాలన్నారు.
సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టాలి: ఇంద్రకరణ్ రెడ్డి - నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
పార్టీ సభ్యత్వాన్ని కార్యకర్తలంతా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని కార్యకర్తలకు మంత్రి సూచించారు.
![సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టాలి: ఇంద్రకరణ్ రెడ్డి Minister indrakaran reddy participated in TRS membership registration meeting nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10616673-901-10616673-1613231321281.jpg)
పార్టీ సభ్యత్వాన్ని అందిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
లక్ష్యం సాధించాలి...
అనుకున్న లక్ష్యానికి కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని కార్యకర్తలను కోరారు. నమోదులో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. అక్కడే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇంఛార్జ్లు లోక భూమారెడ్డి, గంగాధర్ గౌడ్, జడ్పీ చైర్మన్ కె.విజయలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.