ఎన్ని మొక్కలు నాటామన్నది ముఖ్యం కాదు ఎన్నింటిని రక్షించామన్నదే ముఖ్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆరో విడత హరిహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామం వద్ద గల అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు.
'మొక్కలెన్ని నాటామన్నది కాదు.. ఎన్ని రక్షించామన్నదే ముఖ్యం' - నిర్మల్ జిల్లా వార్తలు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా నిర్మల్ జిల్లా కాల్వ గ్రామంలోని అటవీ ప్రాంతంలో మంత్రి మొక్కలు నాటారు. ఎన్ని మొక్కలు నాటామన్నది ముఖ్యం కాదని.. ఎన్నింటిని రక్షించామన్నదే ముఖ్యమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
'ఎన్ని మెుక్కలు నాటామన్నది కాదు.. ఎన్ని రక్షించామన్నదే ముఖ్యం'
అంతరించిపోతున్న అటవీ క్షేత్రాలకు పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో, ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది ప్రతి ఒక్కరు ఒక మొక్కను దత్తత తీసుకోవాలని కోరారు. ఆసుపత్రికి వచ్చిన వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: జగదీశ్ రెడ్డి