సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక, నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతులందరూ ఒకే చోటికి చేరి వారి సాధక బాధలను చర్చించుకోవడానికి ఈ వేదికలు ఎంతగానో దోహదపడుతాయని మంత్రి వెల్లడించారు.
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: ఇంద్రకరణ్ రెడ్డి - nirmal dist news
రైతుల అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక, నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
రైతుల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రైతులకు ఏ సమయాల్లో ఏ పంటలు వేయాలో పలు సూచనలను తెలియజేయడానికి ఏఈవోలు ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తక్కల సంగీత, జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్ల వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు తక్కల రమణ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ రమణ రెడ్డి, జడ్పీకో ఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.