నాణ్యతా ప్రమాణాలు పాటించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అయన పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించి నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి అన్నారు. గత రబీ సీజన్లో ఏర్పడిన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన అనంతరం ధాన్యం ను రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.