నిర్మల్ జిల్లా అధికారులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. మహాత్మా గాంధీ పథకం కింద అనుమతించబడిన పనులను విస్తృతంగా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని పేర్కొన్నారు. జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - హరితహారం కార్యక్రమం తాజావార్తలు
హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు.

ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. వానాకాలంలో నియంత్రిత పంట సాగు చేసేవిధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు.