తెలంగాణ

telangana

By

Published : May 18, 2021, 2:09 PM IST

ETV Bharat / state

బాలల సహాయవాణి వాహనాన్ని ప్రారంభించిన మంత్రి

క‌రోనా కారణంగా త‌ల్లిదండ్రుల‌ను కొల్పోయి అనాథలుగా మారిన పిల్ల‌ల‌కు తెలంగాణ‌ ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

Minister indrakaran reddy launches child helpline vehicle
వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాలల సహాయ వాణి వాహనాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. కొవిడ్​ కారణంగా క‌న్న‌వారిని కొల్పోయిన పిల‌ల్ల‌ను చేర‌దీసి సంర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని మంత్రి అ‌న్నారు. కాల్ సెంట‌ర్​కు కాల్ వ‌చ్చిన 24 గంట‌ల్లో అనాథ పిల్లల‌ను జిల్లా బాల‌ల సంర‌క్ష‌ణ‌ కేంద్రానికి త‌ర‌లిస్తామని చెప్పారు.

బాలిక‌ల‌ను కేజీవీబీ విద్యాల‌యానికి, బాలుర‌ను భైంసాలోని వివేకానంద పాఠశాలలో చేర్పించి విద్య‌ను అందిస్తామ‌ని పేర్కొన్నారు. అనాథ పిల్లలు రోడ్డున ప‌డితే సమాజానికి నష్టమని, అటువంటి పిల్లలను చేరదీసి వారికి విద్యాబద్ధులు నేర్పిస్తే ఉత్తమ పౌరులను అందించిన వారమవుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ABOUT THE AUTHOR

...view details