ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతోనే ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలంలో పర్యటించిన ఆయన.. పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షలతో నిర్మించే ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.
పాలనా సౌలభ్యం కోసమే నూతన పంచాయతీలు : ఇంద్రకరణ్ రెడ్డి - Construction of new Panchayat Buildings in Nirmal
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని తాంశ గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు.
జిల్లాలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ లక్ష్మి లక్ష్మణ్, ఎంపీటీసీ రాజవ్వ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మల్లేశ్ యాదవ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్ రావు, తెరాస మండల కన్వీనర్ అల్లోల గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.