ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శివాజీ చౌక్ నుంచి గాజులపేట్లోని అంబేడ్కర్ చౌక్ వరకు 5 కోట్ల 50 లక్షలతో జరుగుతున్న రోడ్డు వెడల్పు, రహదారి సుందరీకరణ పనులను శుక్రవారం మంత్రి పరిశీలించారు. స్థానిక ప్రజలతో మంత్రి మాట్లాడారు. జిల్లా ఆవిర్భవించిన తర్వాత అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
Minister indrakaran reddy: ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం..: ఇంద్ర కరణ్ రెడ్డి - నిర్మల్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ నుంచి గాజులపేట్లోని అంబేడ్కర్ చౌక్ వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు, రహదారి సుందరీకరణ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు.
![Minister indrakaran reddy: ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం..: ఇంద్ర కరణ్ రెడ్డి minister indrakaran reddy inspected development works in nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:51:58:1624004518-tg-adb-31-18-mantriindrakaran-av-ts10033-18062021134029-1806f-1624003829-614.jpg)
ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం..: ఇంద్ర కరణ్ రెడ్డి
రోడ్డు వెడల్పు, రహదారి సుందరీకరణ పనులకు పట్టణ వాసులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. మరో 28 కోట్ల రూపాయలతో పట్టణాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, దేవరకోట ఆలయ ఛైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా