ఆధ్యాత్మికతకు నిలయంగా నిర్మల్ జిల్లా రూపుదిద్దుకుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. రాష్ట్రం వచ్చాక ఎక్కడా లేని విధంగా నిర్మల్ జిల్లాలో ఆలయాల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న సాయి బాబా ఆలయం నుంచి సాయి దీక్ష సేవా సమితి శ్రావణ సోమవారం పురస్కరించుకొని దిలావర్ పూర్ మండలం కదిలి గ్రామంలోని కదిలి పాపహరేశ్వర ఆలయం వరకు చేపట్టిన పాదయాత్రను మంత్రి ప్రారంభించారు.
Indrakaran reddy: ఆధ్యాత్మికతకు నిలయంగా నిర్మల్ - తెలంగాణ వార్తలు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిర్మల్ జిల్లాలోని ఆలయాలను ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(indrakaran reddy) తెలిపారు. ఆధ్యాత్మికతకు నిలయంగా జిల్లా మారిందని అన్నారు. సాయి దీక్ష సేవా సమితి చేపట్టిన పాదయాత్రను మంత్రి ప్రారంభించారు.
ఇంద్రకరణ్ రెడ్డి, సాయి దీక్ష సేవా సమితి
రానున్న రోజుల్లో కదిలి పాపహరేశ్వర ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సాయి దీక్ష సేవా సమితి వారు చేపట్టిన ఈ పాదయాత్ర భక్తిశ్రద్ధలతో ఆలయానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ సాయి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:BANDI SANJAY: భాజపా ఎప్పటికీ తెరాసతో కలిసి పోటీ చెయ్యదు