రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిచ్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. నిర్మల్ జిల్లా.. గ్రామీణ మండలంలోని మేడిపల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
అన్నదాతల సంక్షేమానికే 'రైతు వేదికలు': మంత్రి ఇంద్రకరణ్ - మేడిపల్లిలో రైతు వేదిక
నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టి రైతును రాజులా చూస్తోందని మంత్రి అన్నారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెట్టి వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తోందని మంత్రి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతి, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమాను ప్రవేశపెట్టి అన్నదాతలకు ఆసరాగా ఉంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రాంరెడ్డి, సర్పంచ్ దుర్గ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గిరిజన వేషధారణలో ఆడిపాడిన ఎమ్మెల్యే