రైతులను సంఘటితం చేసేందుకే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తల్ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతు వేదికలు, రైతుబంధు దేశానికే ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. రైతులందరూ ఒకేచోట చేరి వ్యవసాయంపై చర్చించుకోవడానికి ఈ వేదికలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తోందని మంత్రి వివరించారు.
రైతుబంధు, రైతు వేదికలు దేశానికే ఆదర్శం: ఇంద్రకరణ్ - raithu vedika in kadthal village
నిర్మల్ జిల్లా కడ్తల్ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రైతులందరూ వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించుకోవడానికి అనువైన స్థలంగా రైతు వేదిక ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవశపెట్టి అమలు చేస్తోందని పేర్కొన్నారు.
![రైతుబంధు, రైతు వేదికలు దేశానికే ఆదర్శం: ఇంద్రకరణ్ raithu vedika, minister indrakaran reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10851576-431-10851576-1614758403577.jpg)
రైతు వేదిక, ఇంద్రకరణ్ రెడ్డి
దేశానికి రైతే రాజు అని ప్రభుత్వాలు చెప్పుకుంటాయని.. కానీ కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి వంద రోజులుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పోడు భూముల వివాదం... అటవీ శాఖ, గిరిజనుల మధ్య ఘర్షణ