నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో... అదనపు తరగతి గదులు, వసతుల ఉన్నతీకరణకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్న మంత్రి... రూ.2.05 కోట్లతో విద్యాలయంలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
తెలంగాణలో విద్యాభివృద్ధికి కేసీఆర్ కృషి: ఇంద్రకరణ్ రెడ్డి - అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులకు... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
కరోనాతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉడేందుకు ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుందని... విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్ల వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు రవీందర్ రెడ్డి, నర్మద, ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, తెరాస మండల కన్వీనర్ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది.. కేసీఆర్: మంత్రి జగదీశ్
TAGGED:
nirmal latest news