తెలంగాణ

telangana

ETV Bharat / state

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఇంద్రకరణ్​ - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసిందని... మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్​ జిల్లా అనంతపేట్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

Minister indrakaran reddy foundation stone for construction of KGBV school building in Nirmal district
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

By

Published : Feb 9, 2021, 5:03 PM IST

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు ఉచితంగా విద్యను అందించేందుకే కేజీబీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు... మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్​ జిల్లా అనంతపేట్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవన నిర్మాణానికి... జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీతో కలిసి ఆయన భూమి పూజ చేశారు.

రూ. 3 కోట్ల 50 లక్షల వ్యయంతో పాఠశాల భవన నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఇంటర్​ కళాశాలను సైతం నిర్మిస్తామని తెలిపారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ చదువుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఆరేళ్ల బాలికపై హత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

ABOUT THE AUTHOR

...view details