రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటు పడుతోందని దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలానికి చెందిన 167 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వడ్యల్ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'పేదల పెళ్లిలకు అండగా.. కల్యాణలక్ష్మి' - కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలానికి చెందిన 167 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
'పేదల పెళ్లిలకు అండగా.. కల్యాణలక్ష్మి'
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెళ్లిల పరంగా ఆసరా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ రాంకిషన్ రెడ్డి, మండల ఇంఛార్జి సురేందర్ రెడ్డి, మండల కన్వీనర్ రఘు నందన్ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మీ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గ్రామాల్లో ఆన్లైన్ తరగతులకై టీవీలు పంపిణీ చేసిన ఎంపీ