రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక నూతన ఆలయాలను నిర్మించామని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రామాలయం ప్రొసీడింగ్ కాపీని తన క్యాంపు కార్యాలయంలో గ్రామస్థులకు అందజేశారు.
రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ: ఇంద్రకరణ్ రెడ్డి - నిర్మల్ జిల్లా వార్తలు
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లి గ్రామంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రామాలయం ప్రొసీడింగ్ కాపీని గ్రామస్థులకు అందజేశారు.

ఆలయ నిర్మాణానికి ప్రొసీడింగ్ కాపీని అందజేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 500 ఆలయాలను నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ రఘునందన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ఓస రాజేశ్వర్, తెరాస మండల ఇంఛార్జ్ అల్లోల సురేందర్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, నాయకులు కేశం రమేష్ తదితరులు పాల్గొన్నారు.