రైతులకోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం అంజనీతాండ గ్రామంలో జాదవ్‌రావు అనే రైతు అనారోగ్యంతో మరణించగా... అతని భార్య కలాబాయికి రూ. 5 లక్షల రైతు బీమా చెక్కును మంత్రి తన నివాసంలో అందజేశారు.
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది : ఇంద్రకరణ్ రెడ్డి - Raithu Bheema Check Distribution Nirmal
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుదని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం అంజనీతాండ గ్రామంలో జాదవ్‌రావు అనే రైతు అనారోగ్యంతో మరణించగా... అతని భార్యకు రూ. 5 లక్షల రైతు బీమా చెక్కును మంత్రి అందజేశారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రభుత్వం అందజేసే రైతు బీమా మరణించిన రైతు కుటుంబానికి ఆసరాగా ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాం రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, నర్సాపూర్ జడ్పీటీసీ రామయ్య, అంజనీ తండా సర్పంచ్ జాదవ్ అంజనా బాయి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్