తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మంత్రి మొక్కలు నాటి, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అంతకుముందు మెటర్నిటీ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
కేటీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు - nirmal news
మంత్రి కేటీఆర్ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెటర్నిటీ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంచారు.
minister indrakaran reddy convey birthday wishes to ktr
రాష్ట్రంలో ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదులుకుని వచ్చి తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించారని మంత్రి తెలిపారు. నాటి నుంచి నేటి వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ... పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా కేటీఆర్ ఎదిగారని కొనియాడారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా పురపాలక శాఖ, ఐటీ శాఖలో తనదైన ముద్రవేసి ప్రజల మెప్పు పొందుతున్నారని మంత్రి వివరించారు.