నిర్మల్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలనా ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షకు ఆయన హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
2022 మార్చి నెల వరకు భవనాన్ని పూర్తిచేసి అప్పజెప్పాలని ఆదేశించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం వరి ధాన్యం కొనుగోలు గత సంవత్సరం మాదిరిగా గ్రామాల్లోకి వెళ్లి కొనుగోళ్లు చేపట్టేందుకు పూర్తి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కరోనా బారినపడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.